Diwali offer · Yearly Editor, Studio & Pro 25% off · till 14 Nov (Labh Pancham)14 Nov

AutoCap · తెలుగు

తెలుగు సబ్‌టైటిల్ జనరేటర్: మీరు మాట్లాడండి, క్యాప్షన్స్ వాటంతట అవే వస్తాయి.

చాలామంది Reels, Shorts ని సౌండ్ లేకుండానే చూస్తారు. స్క్రీన్ మీద మాటలు కనిపించకపోతే, చూసేవాళ్ళు తర్వాతి వీడియోకి స్క్రోల్ చేసేస్తారు. AutoCap మీ వీడియోలోని తెలుగు మాటల్ని విని, ప్రతి పదాన్నీ దాని సరైన టైమింగ్‌తో క్యాప్షన్‌గా మారుస్తుంది — కొద్దిసేపట్లోనే, నేరుగా మీ బ్రౌజర్‌లోనే. ఏ యాప్ ఇన్‌స్టాల్ చేయాల్సిన పని లేదు.

మనం తెలుగు మాట్లాడేటప్పుడు మధ్యమధ్యలో ఇంగ్లీష్ పదాలు కలిపేస్తాం — “ఈ రోజు ఒక సింపుల్ రెసిపీ చూపిస్తా” అన్నట్టు. ఇంగ్లీష్ కోసం తయారైన క్యాప్షన్ టూల్స్ ఇలాంటి కలగలుపు మాటల్ని తరచుగా పాడుచేస్తాయి. AutoCap భారతీయ భాషల మీద ట్రైన్ చేసిన స్పీచ్ మోడల్స్‌తో పనిచేస్తుంది, కాబట్టి తెలుగు, ఇంగ్లీష్ కలిసిన వాక్యం కూడా ఒకే వాక్యంగా క్యాప్షన్‌లోకి వస్తుంది.

క్యాప్షన్స్ తెలుగు లిపిలో కావాలా, ఇంగ్లీష్ అక్షరాల్లో (Tenglish) కావాలా, లేక ఇంగ్లీష్ అనువాదం కావాలా — ట్రాన్స్‌క్రైబ్ చేసే ముందే మీరు ఎంచుకుంటారు. తెలుగు వీడియోకి ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ కావాలన్నా ఇదే ఎడిటర్ సరిపోతుంది.

మీకు ఏం లభిస్తుంది

ఒకే రికార్డింగ్, మూడు రకాల క్యాప్షన్స్

తెలుగు లిపి, ఇంగ్లీష్ అక్షరాల్లో తెలుగు (Reels లో చాలామంది ఇలాగే రాస్తారు), లేదా ఇంగ్లీష్ అనువాదం — ఏది కావాలో ట్రాన్స్‌క్రిప్షన్‌కి ముందే మీరు ఎంచుకుంటారు.

ప్రతి పదానికీ దాని సొంత టైమింగ్

క్యాప్షన్స్ లైన్ మొత్తానికి కాకుండా ప్రతి పదానికీ విడిగా టైమ్ అవుతాయి. అందుకే ఒక పదం ఏ క్షణంలో పలికారో, సరిగ్గా అదే క్షణంలో అది స్క్రీన్ మీద కనిపిస్తుంది.

తప్పులు సరిచేయడం సులువు

పేర్లు, బ్రాండ్లు, స్లాంగ్‌లో ఏదైనా పదం తప్పుగా వస్తే, దాని మీద ట్యాప్ చేసి మార్చేయండి. దీర్ఘాలు (అది, ఆది), ళ–ల లాంటివి ఒకసారి చూసుకోండి. ఇలా సరిచేసినందుకు మీ ట్రాన్స్‌క్రిప్షన్ నిమిషాలు మళ్ళీ ఖర్చవ్వవు.

తెలుగు అక్షరాల కోసమే గీసిన ఫాంట్స్

103 క్యాప్షన్ స్టైల్స్, తెలుగు కోసం గీసిన Baloo Tammudu 2 లాంటి ఫాంట్స్‌తో — తలకట్టు, గుణింతాలు, ఒత్తులు సరిగ్గా కనిపించేలా. ఒత్తులు అక్షరం కిందకి వస్తాయి కాబట్టి, రెండు లైన్ల క్యాప్షన్‌లో లైన్ల మధ్య కాస్త ఎక్కువ ఖాళీ ఇవ్వండి.

ఎలా పనిచేస్తుంది

  1. 01

    వీడియో అప్‌లోడ్ చేయండి

    ఫోన్ లేదా కంప్యూటర్ నుంచి MP4 లేదా MOV ఫైల్ ఎంచుకోండి. భాషగా తెలుగు ఎంచుకోండి, లేదా AutoCap నే గుర్తించనివ్వండి.

  2. 02

    లిపి ఎంచుకోండి

    తెలుగు లిపి, ఇంగ్లీష్ అక్షరాలు (Tenglish), లేదా ఇంగ్లీష్ అనువాదం.

  3. 03

    పదాలు సరిచేసి, స్టైల్ ఎంచుకోండి

    ఏ పదాన్నైనా మార్చండి, తర్వాత క్యాప్షన్ స్టైల్, రంగులు, ఫాంట్, యానిమేషన్ ఎంచుకోండి.

  4. 04

    డౌన్‌లోడ్ చేయండి

    క్యాప్షన్స్ ఉన్న MP4 (2K వరకు) నేరుగా బ్రౌజర్‌లోనే తయారవుతుంది. పెయిడ్ ప్లాన్‌లో YouTube Studio కోసం SRT లేదా VTT ఫైల్ కూడా వస్తుంది.

ధర

ఉచిత ప్లాన్‌లో ప్రతి నెలా 2 నిమిషాల ట్రాన్స్‌క్రిప్షన్ వస్తుంది, 60 సెకన్ల వరకు ఉన్న వీడియోలకు. ఎక్స్‌పోర్ట్స్‌కి లిమిట్ లేదు, కానీ వాటి మీద చిన్న AutoCap బ్యాడ్జ్ (వాటర్‌మార్క్) ఉంటుంది.

వాటర్‌మార్క్ లేని క్యాప్షన్స్ కోసం పెయిడ్ ప్లాన్స్ నెలకు ₹399 నుంచి మొదలవుతాయి — Starter లో నెలకు 90 నిమిషాల ట్రాన్స్‌క్రిప్షన్, 5 నిమిషాల వరకు వీడియోలు, SRT/VTT ఫైల్స్. ఒక్క వీడియో నుంచి మాత్రమే వాటర్‌మార్క్ తీసేయాలంటే ₹99. చెల్లింపు రూపాయల్లో, UPI ద్వారా; కార్డ్ సేవ్ అవ్వదు, ఆటో-రిన్యూ ఎప్పుడైనా ఆపేయొచ్చు.

తరచుగా అడిగే ప్రశ్నలు

వీడియోకి తెలుగు సబ్‌టైటిల్స్ ఎలా పెట్టాలి?

AutoCap ఎడిటర్ తెరిచి, వీడియో అప్‌లోడ్ చేసి, భాషగా తెలుగు ఎంచుకోండి. కొద్దిసేపట్లోనే ప్రతి పదం టైమింగ్‌తో సహా క్యాప్షన్‌గా వస్తుంది. పదాలు సరిచూసుకుని, స్టైల్ ఎంచుకుని MP4 డౌన్‌లోడ్ చేయండి — ఏ యాప్ ఇన్‌స్టాల్ చేయక్కర్లేదు.

Reels కి తెలుగు క్యాప్షన్స్ ఎలా యాడ్ చేయాలి?

ఫోన్ బ్రౌజర్‌లో autocap.in తెరిచి మీ Reel వీడియో అప్‌లోడ్ చేయండి. క్యాప్షన్స్ వచ్చాక స్టైల్, రంగు ఎంచుకుని, క్యాప్షన్స్ వీడియోలోనే కలిసిపోయిన MP4 డౌన్‌లోడ్ చేయండి. అదే ఫైల్‌ని Instagram లో Reel గా పోస్ట్ చేయండి. ఉచిత ప్లాన్‌లో 60 సెకన్ల వరకు ఉన్న వీడియోలు చేయొచ్చు.

AutoCap ఉచితమేనా?

అవును. ఉచిత ప్లాన్‌లో ప్రతి నెలా 2 నిమిషాల ట్రాన్స్‌క్రిప్షన్, లిమిట్ లేని ఎక్స్‌పోర్ట్స్ వస్తాయి — AutoCap బ్యాడ్జ్‌తో. బ్యాడ్జ్ లేకుండా ఎక్స్‌పోర్ట్ చేయాలంటే పెయిడ్ ప్లాన్స్ నెలకు ₹399 నుంచి ఉన్నాయి.

తెలుగు, ఇంగ్లీష్ కలిపి మాట్లాడితే అర్థం చేసుకుంటుందా?

అవును. తెలుగులో ఇంగ్లీష్ పదాలు కలిపి మాట్లాడటం మామూలే, AutoCap అలాంటి వాక్యాన్ని ఒకే వాక్యంగా గుర్తిస్తుంది. క్యాప్షన్స్ తెలుగు లిపిలో కావాలా, ఇంగ్లీష్ అక్షరాల్లో (ఉదాహరణకి “ee roju manam nerchukundam”) కావాలా అనేది మీ ఇష్టం.

తెలుగు వీడియోకి ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ వస్తాయా? (telugu to english subtitle generator)

వస్తాయి. లిపి ఎంచుకునేటప్పుడు ఇంగ్లీష్ అనువాదం ఎంచుకోండి — తెలుగు మాటల నుంచి నేరుగా ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ తయారవుతాయి, ప్రతి లైన్ దాని టైమింగ్‌తో. ఒక చిన్న విషయం: అన్న, తమ్ముడు రెండూ ఇంగ్లీష్‌లో “brother” అయిపోతాయి. ఆ బంధుత్వం వీడియోకి ముఖ్యమైతే ఇంగ్లీష్ అక్షరాల్లో తెలుగు ఎంచుకోండి.

మొబైల్‌లో పనిచేస్తుందా? యాప్ డౌన్‌లోడ్ చేయాలా?

యాప్ అవసరం లేదు — AutoCap Play Store లో గానీ App Store లో గానీ లేదు, ఫోన్ బ్రౌజర్‌లోనే నడుస్తుంది. కావాలంటే హోమ్ స్క్రీన్‌కి యాప్ లాగా జోడించుకోవచ్చు. Chrome, Edge లో వీడియో నేరుగా తయారవుతుంది; ఇతర బ్రౌజర్లలో వీడియో ఎంత నిడివి ఉంటే అంతసేపు రికార్డ్ అవుతుంది.

YouTube కోసం SRT ఫైల్ వస్తుందా?

వస్తుంది. పెయిడ్ ప్లాన్‌లో క్యాప్షన్స్‌ని SRT లేదా VTT ఫైల్‌గా డౌన్‌లోడ్ చేసి, YouTube Studio లో సబ్‌టైటిల్ ట్రాక్‌గా జోడించండి.

మీ దగ్గర ఉన్న వీడియోతోనే మొదలుపెట్టండి.

ఉచిత ప్లాన్‌లో ప్రతి నెలా ట్రాన్స్‌క్రిప్షన్ నిమిషాలు, AutoCap బ్యాడ్జ్‌తో లిమిట్ లేని ఎక్స్‌పోర్ట్స్ వస్తాయి. కార్డ్ ఏదీ సేవ్ అవ్వదు.

ఎడిటర్ తెరవండి →